ఎంత పని చేసావ్ సుజనా..ఈ వార్తలు నిజమేగా!

Sunday, July 14th, 2019, 03:10:17 PM IST

ఏపీలోని ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలుగుదేశం పార్టీకు తాగాలని ఎదురు దెబ్బ లేదు. అప్పటి వరకు అదే పార్టీలో ఉన్న కీలక నేతలు ఎంపీ అభ్యర్థులు కనీసం ఆ పార్టీకు ఎలాంటి రాజీనామా కూడా చెయ్యకుండా ఇతర పార్టీలలోకి వెళ్లిపోయారు.అలా టీడీపీ నుంచి తాను ఒక్కడు మాత్రమే వెళ్లకుండా ఇతర ఎంపీ అభ్యర్థులను కూడా సుజనా చౌదరి బీజేపీలోకి తీసుకెళ్లిపోయాడు.దీనితో చంద్రబాబుకు ఊహించని గట్టి దెబ్బె తగిలిందని అంతా భావించే సమయంలోనే మళ్ళీ సుజనా తెలుగుదేశం పార్టీకు గట్టి దెబ్బ కొట్టనున్నారని వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

తాను మాత్రమే వెళ్లడం కాకుండా టీడీపీ నుంచి భారీ స్థాయి వలసలు తీసుకెళ్ళిపోతారు అని వార్తలొచ్చాయి. అలాగే ఈ రోజు సుజనా బీజేపీ పార్టీలోకి చేరిన తర్వాత మొట్టమొదటి సారిగా ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టారు.ఇలా రావడంతోనే ఇక్కడి బీజేపీ నేతలు మరియు కార్యకర్తలు సుజనకు ఘనమైన స్వాగతాన్ని అందించారు.ఆ తర్వాత అక్కడ సభలో కొంతమంది బీజేపీ నేతలు మాట్లాడుతూ సుజనా మాత్రమే కాదని బీజేపీలోకి టీడీపీ నుంచి ఇంకా భారీ వలసలు సిద్ధంగా ఉన్నాయని తెలిపిన వార్త ఇప్పుడు మళ్ళీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది.మరి రాబోయే రోజుల్లో టీడీపీ పరిస్థితి ఇంకెలా ఉంటుందో చూడాలి.