ఈ సారి లెక్కతప్పనంటున్న సుకుమార్?

Sunday, May 27th, 2018, 09:40:19 AM IST

మన లెక్కల మాస్టారు .. అదేనండి సుకుమార్ రంగస్థలం సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చేశాడు. ఏకంగా 200 కోట్ల వసూళ్లతో టాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత అయన మళ్ళీ మహేష్ తో సినిమాకు కమిట్ అయ్యాడు. మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో మొదలు కానుంది. మహేష్ తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేస్తున్నాడు . ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసుకున్న ఈ సినిమా జూన్ మొదటి వారంలో అమెరికాలో షూటింగ్ మొదలు కానుంది. ఇక సుకుమార్ తో తన 26 వ సినిమా చేస్తున్న మహేష్ తో సుక్కు ఎలాంటి సినిమా చేస్తాడు అన్న ఆసక్తి ఎక్కువైంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోకున్నా కూడా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. అయితే ఈ సారి కూడా సుకుమార్ థ్రిలర్ నేపథ్యంలోనే ఓ కథను సిద్ధం చేస్తున్నట్టు టాక్. థ్రిల్లర్ అంశాలతో పాటు మైండ్ గేమ్ తో సాగె కథ అని, ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని తెలిసింది. సో ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మరి 1 విషయంలో జరిగిన లెక్కల తప్పులు ఈ సారి చేసేదే లేదంటున్న సుకుమార్.

  •  
  •  
  •  
  •  

Comments