సుకుమార్ బాలీవుడ్ ఎంట్రీ .. రంగంలోకి జక్కన్న తండ్రి ?

Saturday, July 28th, 2018, 10:51:53 AM IST

లేటెస్ట్ గా టాలీవుడ్ లో వందకోట్ల గ్రాస్ తెచ్చిన దర్శకుడిగా ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్నాడు సుకుమార్. రంగస్థలం చిత్రం ఏకంగా 200 కోట్లకు పైగా భారీ వసూళ్లు అందుకుంది. ఈ సినిమా తరువాత సుక్కు మహేష్ తో సినిమాకు కమిట్ అయ్యాడు, కానీ ప్రస్తుతం మహేష్ తన 25 వ సినిమా షూటింగ్ లో పాల్గోంటున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైం పట్టేలా ఉండడంతో ఈ లోగా బాలీవుడ్ లో ఓ సినిమా చేయాలనీ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే చర్చలు జరిగిన ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. వరుణ్ ధావన్ హీరోగా నటించే ఈ హిందీ సినిమా ఆగస్టు లో మొదలు కానుందట. అయితే ఈ సినిమా విషయంలో ఎంట్రీ ఇస్తున్నాడు ప్రముఖ రచయితా విజయేంద్ర ప్రసాద్. బాహుబలి, బజ్రంగి భాయిజాన్ సినిమాల రచయితగా మంచి క్రేజ్ తెచ్చుకున్న అయన లేటెస్ట్ గా తమిళంలో మెర్సల్ చిత్రానికి కథ అందించాడు. అయన ఏ కథ రాసినా దానికి భారీ డిమాండ్ రావడంతో తాజాగా హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎరోస్ వాళ్ళు ఆయనతో ఓ సెటిలెమెంట్ చేసుకున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ ఇచ్చి పలువురు దర్శకులతో సినిమాలు తీయాలని అగ్రిమెంట్ చేసుకున్నారట. ఈ కోవలోనే సుకుమార్ సినిమా ఉంటుందని సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments