రంగస్థలం లోని ఆ పాట వివాదం పై సుకుమార్ క్లారిటీ!

Thursday, March 15th, 2018, 05:30:53 PM IST

ఇటీవల విడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా తెరకెక్కిన సినిమా రంగస్థలం 1985 సినిమా పాటలు మంచి స్పందనను అందుకున్నాయి. అయితే నేడు ఈ సినిమా లోని పాటలను యూట్యూబ్ లో విడుదల చేసింది సినిమా యూనిట్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇటీవల ఈ సినిమాలోని రంగమ్మ మంగమ్మ సాంగ్ రిలీజై మంచి హిట్ అయింది. ఈ పాటలో ‘గొల్లభామ వచ్చి నాగోరు గిల్లుతుంటే’ అంటూ సాగిన చరణం యాదవ మహిళలను కించపరిచే విధంగా ఉందని, వెంటనే దాన్ని తొలగించాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

పాటలోని ఆ చరణాన్ని తొలగించాలని, లేని పక్షంలో సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. దీనిపై తాజాగా దీనిపై డైరెక్టర్ సుకుమార్ స్పందించారు. గొల్లభామ అనే పదం మనుషులను ఉద్దేశించింది కాదని, అదొక పురుగని తెలిపారు. గొల్లభామ అనే పురుగు అందరికీ తెలిసే ఉంటుందని ఆ పదం పై క్లారిటీ ఇచ్చారు. కాగా సుకుమార్ ఇచ్చిన క్లారిటీపై అభ్యంతరం వ్యక్తం చేసిన వాళ్లు ఎలా స్పందిస్తారనే దానిపై వేచి చూడాలి….