కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయాను..మహానటిపై సుకుమార్ కామెంట్స్!

Thursday, May 10th, 2018, 04:40:03 PM IST

సావిత్రి బయోపిక్ మహానటి సినిమాకు ప్రస్తుతం ప్రేక్షకులతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఇప్పటికే రాజమౌళి వంటి వారు దర్శకుడిని ప్రశంసిస్తూ ట్వీట్ చేయగా.. ఇటీవల రంగస్థలం వంటి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న సుకుమార్ కూడా నాగ్ అశ్విన్ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

‘ప్రియ’మైన అశ్విన్.. మహానటి సినిమా చూసి బయటకి వచ్చి నీతో మాట్లాదామని నీ నంబర్ కి ట్రై చేస్తున్నాను. ఈలోగా ఒక ఆవిడ వచ్చి “నువ్వు డైరెక్టరా బాబు” అని అడిగింది. అవునన్నాను.. అంతే.. నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది” ఎంత బాగా చూపించావో బాబు మా సావిత్రమ్మని” అంటూ.. నా కళ్లల్లో నీళ్లు.. నేను నువ్వు కాదని ఆవిడకి చెప్పలేకపోయాను.. ఆవిడ ప్రేమంతా నేనే తీసుకున్నాను.. మనసారా.. ఆవిడా నన్ను దీవించి వెళ్లిపోయింది.. కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయాను ఆనందంతో.. ఇంతకన్నా ఏం చెప్తాను.. నా అనుభూతి ఈ సినిమా గురించి..

గమనిక: ఆవిడకి ఎప్పటికీ నేను నువ్వు కాదని తెలియకపోతే బావుండు.. అని సుకుమార్ తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో పోస్ట్ చేశారు.