శివనాగులు పాటని అందుకే తీసేసాం: సుకుమార్

Tuesday, April 3rd, 2018, 01:20:02 PM IST

రంగస్థలం చాలా రోజులుగా పబ్లిక్ లో ఎంత లెవల్ లో హైప్ క్రియేట్ చేసిందో అంతే లెవెల్ లో హిట్ కొట్టింది. ప్రతీ సన్నివేశం నిజ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రేక్షకుల మనస్సులకు హత్తుకుపోయే విధంగా తీర్చి దిద్దారు దర్శకుడు సుకుమార్. సినిమాలోని రామ్ చరణ్, సమంతాల నటన కూడా వారి పాత్రలకు తగ్గట్టుగా ఎక్కడా తీసిపోకుండా సరైన న్యాయం చేసారు. సినిమా పాటలు కూడా అభిమానుల మెదల్లలో మారుమోగిపోతున్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ, సినిమాలో ఒక్క విషయం మాత్రం అభిమానులని చాలా నిరాశ పరచింది.

అదేమిటా అనుకుంటున్నారా..? ఆగట్టునుంటావా నాగన్న పాట, ఆడియో ఆల్బమ్ లో ఈ పాటను జానపద గాయకుడు, గేయ రచయిత శివ నాగు ఆలపించాడు, కానీ సినిమాలో మాత్రం ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించాడు. శివ నాగు వాయిస్ తో ప్రేక్షకుల మైండ్స్ లో ఫిక్స్ అయిపోయిన ఈ పాట దేవిశ్రీ గొంతుతో వినగానే బాగా నిరాశపరచింది. సినిమా మొత్తంలో ఈ పాటకు సంబంధించి ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇలా ఎందుకు జరిగింది అని ఓ మీడియా ప్రతినిధి దర్శకుడు సుకుమార్ ను ఇంటర్వ్యు చేయగా, అసలు ముందుగా ఈ పాటను దేవిశ్రీ ఆలపించాడని, తర్వాత శివ నాగు ఆలపించాడని అన్నారు. కానీ ముందు దేవీ పాడిన పాటనే పెట్టి సాంగ్ షూటింగ్ పూర్తి చేసామని, కానీ శివనాగు పాడిన వాయిస్ తో ఈ పాటని బ్యాక్ గ్రౌండ్లో మళ్ళీ పెట్టాలి అనుకున్నామని సుకుమార్ అన్నాడు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ శివ నాగు ఆలపించిన పాట షూటింగ్ చేసిన పాటకి సింగ్ కాలేదని, ఎలా అయినా సరే సింక్ చేసి శివనాగు పాడిన పాటనే పెట్టాలని ప్రయత్నించామని అన్నారు. కానీ కుదరలేదని, దేవీ శ్రీ కూడా చాలా బాధపడ్డారని అన్నారు. ఆడియో ఆల్బం లో మాత్రం శివనాగు పాడిన పాటే ఉంటుందన్నారు. ఇలాంటి తప్పిదం జరిగినందుకు ప్రేక్షకాభిమానులు క్షమించాలని సుకుమార్ కోరారు.