మ‌హేష్26 క‌థ‌లో సుక్కూ లాజిక్ ఇదే!

Friday, May 25th, 2018, 10:20:07 AM IST

టాలీవుడ్‌లో రేర్ ట్యాలెంట్ సుకుమార్‌.. అత‌డి ద‌ర్శ‌క‌త్వ శైలి ఏ ఇత‌ర ద‌ర్శ‌కుడితో పోల్చి చూసినా …స‌ప‌రేట్‌గా ఉంటుంది. మ్యాథ‌మెటిక్స్ లెక్చ‌ర‌ర్‌గా అత‌డి లాజిక్కులు ఆషామాషీగా ఉండ‌వు. అత‌డి లాజిక్ వ‌ర్క‌వుటైతే ఇండ‌స్ట్రీ హిట్ గ్యారెంటీ అని రంగ‌స్థ‌లం చిత్రం నిరూపించింది. అంత‌కుముందు నాన్న‌కు ప్రేమ‌తో, ఆర్య చిత్రాలు ఆ స్థాయిని ఎలివేట్ చేశాయి.

1నేనొక్క‌డినే విష‌యంలో అద్భుత టెక్నిక్ వర్క‌వుటైనా.. ఓ చిన్న మిస్టేక్ లెక్క త‌ప్పేలా చేసింది కానీ.. అస‌లు సుక్కూ గురించి వేలెత్తి చూపించ‌గ‌లిగేవాడే లేడు. ప్ర‌స్తుతం సుకుమార్ ఈసారి మ‌హేష్26 కోసం క‌థ రెడీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌థ‌, స్క్రిప్టు పూర్తిగా రెడీ చేశాక ఈ ఏడాది చివ‌రిలో సెట్స్‌పైకి తీసుకెళ‌తాడ‌ట‌. అయితే ఈసారి మ‌హేష్ క‌థ‌లో ఏ లాజిక్ వాడుతున్నాడు? అంటూ అభిమానుల్లో ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రివ‌ర్స్ స్క్రీన్‌ప్లే, మైండ్ ప్లే, సైక‌లాజికల్ థ్రిల్ల‌ర్‌.. లేదూ ఇంకేదైనానా? అంటూ ఒక‌టే ఆస‌క్తి రేకెత్తుతోంది. అయితే ఈసారి మ‌హేష్ 26 స్క్రిప్టులో గ్రేషేడ్ ఒక‌టి ఉంటుంద‌ని, అలానే అదిరిపోయే సందేశం, ఇంట‌ర్వెల్ బ్యాంగ్ షురూ అయ్యాయ‌ని తెలుస్తోంది. ఆస‌క్తిక‌రంగా ఈ సినిమాకి లైన్‌ని సుక్కూ త‌న అసోసియేట్ నుంచి తీసుకున్నార‌ట‌.

  •  
  •  
  •  
  •  

Comments