మెగా హీరోకోసం .. సుకుమార్ ప్రయత్నాలు ?

Thursday, September 6th, 2018, 10:44:45 PM IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాకు సిద్ధం అవుతున్న క్రేజీ దర్శకుడు సుకుమార్, ఇప్పటికే మైత్రి మూవీస్ లో ఈ సినిమాను చేస్తున్నాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు అటు నిర్మాతగా కూడా భిన్నమైన కథలతో సుకుమార్ రైటింగ్స్ పై సినిమాలు నిర్మిస్తున్న అయన ఈ సార్ మెగా హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. సుకుమార్ రైటింగ్స్ తో పాటు మైత్రి మూవీస్ కలిపి నిర్మించే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ హీరోగా నటిస్తాడని అంటున్నారు.

నిజానికి ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నాడని, రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా ఉండొచ్చనే వార్తలు కూడా వచ్చాయి. అయితే మెగా హీరోని పరిచయం చేసే ప్రయత్నం సుకుమార్ బ్యానర్ లో జరుగుతుంది. ఈ సినిమాకు సుకుమార్ దగ్గర రైటర్ గా పనిచేసిన సాన బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తాజాగా ఈ సినిమాకోసం అచ్చ తెలుగు అమ్మాయి కావాలని కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చారు. అచ్చ తెలుగు అమ్మాయి అయితే బాగుంటున్న ఆలోచనలో ఆ దిశగా అన్వేషణ సాగిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments