సుకుమార్ తో సూపర్ స్టార్ సినిమా కన్ఫర్మ్ అయినట్టే ?

Sunday, April 15th, 2018, 04:30:26 PM IST

రంగస్థలం సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఓ రేంజ్ లో షేక్ చేస్తున్నాడు రామ్ చరణ్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం అన్ని సెంటర్స్ లో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు సుకుమార్ నెక్స్ట సినిమా ఎవరితో అన్న విషయం పై పలు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో చేస్తాడని, లేదా అల్లు అర్జున్ తో ఉంటుందని, మధ్యలో అఖిల్ పేరు వినిపించింది. దాంతో పాటు మెగాస్టార్ తో కూడా ఉంటుందని రకరకాల వార్తలు వస్తున్నా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుకుమార్ నెక్స్ట్ సినిమా మళ్ళీ మహేష్ తో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్ లో 1 నేనొక్కడినే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గా అంతగా వర్కవుట్ కాలేదు .. అయినా సరే సుకుమార్ టాలెంట్ కు ఫిదా అయినా మహేష్ మరోసారి ఆయనతో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగినట్టు టాక్. మహేష్ 26వ సినిమా సుకుమార్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments