మెగాస్టార్ తో క్రేజీ దర్శకుడి సినిమా ?

Saturday, April 14th, 2018, 11:19:25 AM IST

ప్రసుతం టాలీవుడ్ లో ఎక్కడ చుసిన రంగస్థలం సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. గత నెల 30 న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్దలు కొట్టేసింది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటుడిగా మరో మెట్టు ఎక్కేసాడు. నిన్న ఈ సినిమా విజయోత్సవాన్ని హైద్రాబాద్ లో జరిపారు. ఇక సుకుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న ప్రశ్నలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే సుకుమార్ మెగాస్టార్ తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రంగస్థలం సినిమా విడుదలకు ముందే మెగాస్టార్ తో సినిమా చేయాలనీ చరణ్ చెప్పాడని .. ఆ నేపథ్యంలో మెగాస్టార్ కోసం ఓ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో షికారు చేస్తుంది. రంగస్థలం లాంటి గొప్ప సినిమా చేసిన సుకుమార్ తో సినిమా చేయడానికి అటు మెగాస్టార్ కూడా సిద్ధంగా ఉన్నాడట. ఇప్పటికే ఆయనకు సుకుమార్ కూడా ఓ లైన్ వినిపించాడని టాక్. మెగాస్టార్ ప్రస్తుతం చేస్తున్న సైరా పూర్తయ్యాక సుకుమార్ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.