ఆ బ్యానర్ లోనే మరో రెండు సినిమాలతో సుకుమార్ ?

Monday, April 2nd, 2018, 10:57:40 AM IST

రంగస్థలం సినిమాతో తన కత్తికి రెండు వైపులా పదునే అని నిరూపించుకున్నాడు క్రేజీ దర్శకుడు సుకుమార్. 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో లాంటి అడ్వాన్స్డ్ సినిమాలు తీసిన సుకుమార్ 1980 ల కథతో అచ్చంగా పల్లెటూరి నేపథ్యంలో ఓ సినిమా తీసి శహబాస్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఎక్కడ చుసిన రంగస్థలం హవా కనిపిస్తుంది. అసలే క్రేజీ దర్శకుడిగా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న సుక్కు కి సంచలన విజయం వచ్చిందంటే నిర్మాతలు ఊరుకుంటారా క్యూ కట్టేయ్యారు ..

అయితే రంగస్థలం సినిమా తీసిన మైత్రి మూవీస్ బ్యానర్ లోనే మరో రెండు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడట సుకుమార్. శ్రీమంతుడు సినిమాతో నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీస్ కొత్త తరహా సినిమాలతో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం నాగ చైతన్య తో సవ్యసాచి,. రవితేజ – శ్రీను వైట్ల తో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాలను నిర్మిస్తున్న ఈ బ్యానర్ లో నెక్స్ట్ సినిమా సుకుమార్ తో మరో సినిమాకు సిద్ధం అయింది. మరి సుకుమార్ నెక్స్ట్ సినిమాలో హీరో ఎవరో అన్న విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments