సుకుమార్ నెక్స్ట్ సినిమా .. అదేనా ?

Thursday, March 29th, 2018, 10:34:04 AM IST

టాలీవుడ్ లో అగ్రదర్శకులలో ఒకడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు సుకుమార్. అయన సినిమాలంటే ప్రేక్షకులకు ప్రత్యేక ఆసక్తి. సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో తెరకెక్కించిన రంగస్థలం చిత్రం రేపు విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా అత్యంత భారీగానే విడుదల అవుతుంది. సుకుమార్ చేసిన సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో ఉంటాయని ఓ టాక్ ఉంది. 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, ఇప్పుడు రంగస్థలం ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్ లో తెరకెక్కినవే. రంగస్థలం సినిమాకోసం ఓ విలేజ్ సెట్ ని భారీ బడ్జెట్ తో హైద్రాబాద్ లో వేశారు. దానికోసం బడ్జెట్ కూడా ఓ రేంజ్ లో అయింది. ఇక ఆయన నెక్స్ట్ సినిమా విషయంలో కాస్త ట్రెండ్ మారుస్తున్నట్టు తెలుస్తోంది. తనపై ఉన్న రూమర్ ని తగ్గించుకునే పనిలో భాగంగా సుకుమార్ ఈ సారి ఓ చిన్న బడ్జెట్ లో ఓ యువ హీరోతో సినిమా చేస్తాడని అంటున్నారు. ఒక సినిమా పూర్తయ్యాక కాస్త గ్యాప్ తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసే సుకుమార్ ఈ సినిమాకోసం ఎక్కువ టైం తీసుకోరట. మరి సుకుమార్ సినిమాలో నటించే ఆ కుర్ర హీరో ఎవరో .. తెలియలాంటి ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.