అందరూ యాంకర్ సుమ ని చూసి నేర్చుకోవాలి – వెంకయ్య నాయుడు :

Tuesday, December 27th, 2016, 11:51:18 AM IST

venkaiah-naidu
నందమూరి బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో వేడుక ఘనంగా జరిగింది. తిరుపతి లో అంగరంగ వైభవంగా సాగిన ఈ ఆడియో వేడుక తెలుగు వారు అందరికీ గర్వకారణం అయిన శాతకర్ణి మీద ఫోకస్ అయ్యింది. ఈ వేడుకకి యాంకర్ గా చేసిన సుమ అచ్చం తెలుగు అమ్మాయి లాగా ఆకట్టుకుంది . ఎంతగా అంటే వెంకయ్య నాయుడు సైతం ఆమెని ప్రశంసల లో ముంచేశారు. ‘చాలా చక్కగా మంచిగా డైలాగులు చెబుతూ ఉన్నావమ్మా. మా తెలుగు వాళ్లందరూ నిన్ను చూసి నేర్చువాల్సి ఉంది. నువ్వు కూడా ఇప్పడు మా తెలుగు అమ్మాయివే అనుకో. కానీ అందరూ నిన్ను చూసి నేర్చుకోవాల్సి ఉంది. ఆ కట్టు.. బొట్టు.. మాట.. పాట.. ఇవన్నీ కూడా మన పద్ధతులు మనం నేర్చుకోవాల్సి ఉంది. ఆపని నువ్వు చేస్తున్నావు. నీకు కూడా అభినందనలు’ అన్నారు వెంకయ్య.

  •  
  •  
  •  
  •  

Comments