పూలరంగడు దర్శకుడితో సునీల్ సినిమా ?

Friday, March 23rd, 2018, 10:20:30 AM IST

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ కు ఈ మధ్య వరుస పరాజయాలతో సతమవుతున్నాడు. దాంతో ఈ మధ్య అవకాశాలు కూడా తగ్గాయి. దాంతో మళ్ళీ కమెడియన్ గా సిద్దమయ్యాడు. ఇప్పటికే శ్రీనువైట్ల, త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి సినిమాల్లో కమెడియన్ గా నటిస్తున్న సునీల్ కు హీరోగా మరో అవకాశం వచ్చింది. సునీల్ కు పూలరంగడు లాంటి సూపర్ హిట్ అందించిన వీరభద్రం దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే సునీల్ కు కథ చెప్పి ఒప్పించాడట. కథ బాగా నచ్చడంతోనే హీరోగా ఓకే చెప్పాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుందట.