మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ కావాలి! – గీతామాధురి సాంగ్ లాంచ్‌లో సునీల్‌

Saturday, February 18th, 2017, 07:58:27 PM IST


ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌ని రామ్ నిర్మించిన సినిమా -`మెట్రో`. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను కళ్ళకు కడుతూ.. తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల‌లో మార్చి 3న విడుద‌ల చేస్తున్నారు.
ఇటీవ‌లే రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి, పోస్ట‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత గాయ‌ని గీతామాధురి ఈ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గీతామాధురి సాంగ్‌ని హీరో సునీల్ `ఉంగ‌రాల రాంబాబు` సెట్స్‌లో ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భ ంగా సునీల్ మాట్లాడుతూ -“మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి.. అన్న కాన్సెప్టుతో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అంద‌రూ ఆద‌రించాలి. చాలా కొత్త పాయింటుతో, చైన్ స్నాచింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -“గీతామాధురి త‌నే స్వ‌యంగా పాడి, త‌నే న‌టించిన పాట‌ను హీరో సునీల్ ఆవిష్క‌రించారు. ఇన్నాళ్లు తెర‌వెన‌క గీతామాధురి పాట‌లు వింటున్నాం. ఇప్పుడు తెర‌పై త‌ను క‌నిపించ‌బోతున్నారు. ఇంత‌వ‌ర‌కూ తెలుగు ఇండ‌స్ట్రీలో రాని కొత్త పాయింటుతో మంచి కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 3న తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నాం“ అని తెలిపారు.

నిర్మాత ర‌జ‌నీ రామ్ మాట్లాడుతూ-“చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌తో సాగే చిత్ర‌మిది. గౌత‌మ్ మీన‌న్, ఏ.ఆర్.మురుగ‌దాస్ వంటి ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు పొందిన చిత్ర‌మిది. గీతామాధురి సాంగ్‌ని హీరో సునీల్ ఆవిష్క‌రించినందుకు ధ‌న్య‌వాదాలు. మార్చి 3న రిలీజ‌వుతున్న ఈ చిత్రం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.