సక్సెస్ ఇచ్చిన దర్శకుడితో సునీల్ సినిమా?

Monday, March 26th, 2018, 02:53:33 PM IST

స్టార్ కమెడియన్ ఒకప్పుడు ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సునీల్ హీరోగా మాత్రం ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదని అందరికి తెలిసిందే. ఇక ఫైనల్ గా మళ్లీ కమెడియన్ గా మారాలని డిసైడ్ అయ్యాడు. అలాగని హీరోగా ప్రయత్నాలు తగ్గించడం లేదు. మంచి కథలొస్తే చేస్తానని చెబుతూ.. కమెడియన్ గా కూడా కొనసాగుతానని చెప్పాడు. అయితే అప్పట్లో సునీల్ తో పూలరంగడు తీసిన దర్శకుడు వీరభధ్రమ్ మళ్లీ సునీల్ తో చేయాలనీ అనుకుంటున్నాడట. ఆల్ రెడీ కథను కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పూల రంగడు సినిమా ఇద్దరికి వచ్చిన చివరి హిట్ సినిమా. ఆ తరువాత వీరభద్రమ్ భాయ్ – చుట్టాలబ్బాయి వంటి సినిమాలు చేసినా పెద్దగా హిట్ అవ్వలేదు. సునీల్ కూడా చాలా డిజాస్టర్స్ అందుకున్నాడు. మరి ఇప్పుడు వీరిద్దరు కలిసి కెరీర్ ను మళ్లి ఒక సక్సెస్ ఫుల్ ట్రాక్ లోకి తెచ్చుకుంటారో లేదో చూడాలి.