సునీల్ రీ ఎంట్రీకి నాలుగు లక్షలా?

Saturday, June 9th, 2018, 05:42:23 PM IST

కమెడియన్ గా కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించిన సునీల్ హీరోగా మాత్రం అనుకున్నంతగా మెప్పించలేకపోయాడు. మర్యాద రామన్న తప్పితే కెరీర్ లో పెద్దగా విజయాలు లేవు. చాలా వరకు సునీల్ కామెడీని మిస్ అవుతున్నాం అనేలా ఫ్యాన్స్ కామెంట్ చేయడంతో సునీల్ మళ్లీ కమెడియన్ గా తన కెరీర్ ను కొనసాగించనున్నాడు. ఇప్పటికే నాలుగు అగ్ర దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
త్రివిక్రమ్ – శ్రీను వైట్ల అలాగే భీమనేని శ్రీనివాసరావ్ – హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న సినిమాల్లో సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నాడు.

మంచి కామెడీ పాత్రలు దొరికేయట. ఆ సీన్స్ సినిమాలకే హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఇకపోతే కమెడియన్ క్యారెక్టర్ కాబట్టి కాల్షిట్స్ ప్రకారం మనోడికి రెమ్యునరేషన్ అందుతుందట. రోజుకి నాలుగు లక్షల వరకు అందుతున్నట్లు తెలుస్తోంది. హనురాఘవాపుడి శర్వానంద్ తో చేస్తున్న సినిమాలో సునీల్ పాత్ర కోసం 15 రోజుల కాల్షీట్స్ తీసుకున్నట్లు టాక్. ఈ విధంగా సునీల్ రోజు బిజీగా ఉంటే కమెడియన్ గానే ఎక్కువగా తన ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. మరి సునీల్ రీ ఎంట్రీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments