స్ట‌న్నింగ్‌ : మోదీ బ‌యోపిక్ (X) స‌న్నీ బ‌యోపిక్‌!

Wednesday, March 7th, 2018, 10:05:39 PM IST

బ‌యోపిక్‌ల జోరు చూస్తుంటే అస‌లు ఎవ‌రినీ వ‌దిలిపెట్టేట్టు లేరు మేక‌ర్స్‌. చివ‌రికి పోర్న్‌స్టార్ల‌ను వ‌దిలిపెట్ట‌డం లేదు. ఓవైపు గొప్ప గొప్ప సైంటిస్టులు, క్రీడాకారులు, పారిశ్రామిక వేత్త‌ల జీవితాల‌పై సినిమాలు తీస్తూనే, మ‌రోవైపు ఎమోష‌న్స్‌ని రెచ్చ‌గొట్టే శృంగార తార‌ల జీవితాల్ని చ‌దివేస్తున్నారు.

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపైనే సినిమా తీస్తున్నార‌ని నిన్న‌నే వార్త అందింది. మోదీ బ‌యోపిక్‌లో శ‌త్రుఘ్న సిన్హాలాంటి స్టార్ న‌టిస్తున్నార‌న‌గానే ఆస‌క్తి రెయిజ్ అయ్యింది. అయితే మోదీ ఒక ఛాయ్ వాలా నుంచి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా, భార‌త‌దేశ ప్ర‌ధానిగా అంచెలంచెలుగా ఎదిగిన వైనం స్ఫూర్తి నింపుతుంది. అందుకే ఈ బ‌యోపిక్ ప్ర‌క‌టించార‌ని అనుకోవ‌చ్చు. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా ఉండే ష‌కీలా బ‌యోపిక్ ప్ర‌క‌టించి షాకిచ్చారు మేక‌ర్స్‌. ఈలోగానే స‌న్నీలియోన్ డాక్యుబ‌యోపిక్ అంటూ మ‌రో కొత్త బ‌యోపిక్ ప్ర‌కంప‌నాలు రేపుతోంది. స‌న్నీ బ‌యోపిక్‌పై చాలా కాలంగానే వార్త‌లొస్తున్నాయి. దేశం వ‌దిలి దేశంకాని దేశ‌మైన అమెరికాలో, కెన‌డాలో స‌న్నీ ఎలాంటి ఉద్యోగాలు చేసింద‌న్న‌ది? తెర‌పై చూపించ‌బోతున్నారు. ఎలాంటి ప‌రిస్థితుల్లో స‌న్నీ పోర్న్ స్టార్ అవ్వాల్సొచ్చిందో కూడా చూపిస్తారుట‌. `క‌రెంజిత్ టు స‌న్నీ` పేరుతో డాక్యుమెంట‌రీ తీసి జీగ్రూప్ సంస్థ టీవీలో ఎపిసోడ్ ఎపిసోడ్లుగా లైవ్ చేయ‌నుంది.