నా పిల్లలు నాలాగే బాధపడకూడదు: సన్నీ లియోన్!

Monday, April 2nd, 2018, 04:26:15 PM IST

ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంటున్న బ్యూటీ సన్నీ లియోన్. ఆమె సినిమాలో చిన్న స్టెప్ వేస్తె చాలు కుర్రకారు తెగ సంబరపడిపోతారు. అంతే కాకుండా ఎక్కడికైనా వేడుకలకు గెస్ట్ గా వస్తోంది అంటే చాలు సన్నీని చూడటానికి ఎగబడతారు. అయితే సన్నీ ఇప్పుడు గొప్ప సెలబ్రెటీగా గుర్తింపు తెచ్చుకుంది గాని ఒకప్పుడు ఆమె కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. తన 21 ఏళ్లలో ఎంతో అవమానకరంగా మెయిల్స్ పంపేవారని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ తెలిపింది. సన్నీ లియోన్ జీవిత ఆధారంగా ‘కరణ్‌జీత్‌ కౌర్‌-ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీ లియోనీ’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సందర్బంగా సన్నీ మాట్లాడుతూ.. నా 21 ఏళ్ల వయస్సులో ద్వేషిస్తూ మెయిల్స్ మెస్సేజ్ లు చేసేవారు. ఒక్క దేశమని కాదు ప్రస్తుత సమాజమే అలాంటి ధోరణిలో ఉంది. ఆ వయసులో నిందలు చెడు మాటలు చాలా ఆవేదనకు లోను చేస్తాయి. ఆ టైమ్ లో నా పేరెంట్స్ నాకు అండగా నిలిచారు. వారికి నచ్చని పని చేశాను. నాకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకున్నాను. ఎన్నో బాధలను ఇబ్బందులను ఎదుర్కొన్నాను. కానీ నా పిల్లలు ఆ విధంగా కష్టాలను ఎదుర్కోకూడదు అని కోరుకుంటున్నా. ఓ తల్లిగా వారు స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకుంటున్నట్లు సన్నీ లియోన్ తెలిపింది. ఇటీవల సరోగసి ద్వారా సన్నీ లియోన్ ఇద్దరు మగ బిడ్డలకు తల్లయ్యింది. అంతకుముందే మహారాష్ట్ర కు చెందిన ఏడాదిన్నర పాపను సన్నీ దంపతులు దత్తత తీసుకున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments