వెబ్ సిరీస్ గా సన్నీ లియోన్ జీవితం ?

Wednesday, May 16th, 2018, 12:57:41 PM IST

పోర్న్ స్టార్ గా ఓ రేంజ్ లో సంచలనం రేపిన సన్నీ లియోన్ ఎప్పుడైతే జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండే ఆమె కెరీర్ పెద్ద మలుపు తిరిగింది. జిస్మ్ 2 తరువాత సన్నీ కి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఒక్క హిందీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బాషల వాళ్ళు ఆమెతో సినిమాలు తీయడానికి తెగ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక హిందీ, తెలుగు, తమిళ, మలయాళ లాంటి పలు భాషల్లో క్రేజ్ తెచ్చుకున్న సన్నీ లియోన్ కు క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. దాంతో ఆమె జీవిత కథను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అది సినిమాగా కాదట .. !! వెబ్ సిరీస్ గా అని టాక్.

కేవలం 2 గంటల్లో సన్నీ జీవితాన్ని చెప్పడం కుదరదని ఆలోచనలో భాగంగా వెబ్ సిరీస్ ప్లాన్ చేశారట. దాంతో పాటు సన్నీ జీవితం అంటే కొన్ని సన్నివేశాలు సెన్సార్ పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి వెబ్ సిరీస్ అయితే బాగుందని ఈ ప్లాన్ చేశారట. ఈ వెబ్ సిరీస్ లో సన్నీ లియోన్ జీవితం, బాల్యం, పోర్న్ స్టార్ గా ఆమె ఎదిగిన తీరు అన్ని ఉంటాయట. కరణ్ జీత్ కౌర్ .. ది అన్ టోల్డ్ స్టోరీ పేరుతొ ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించనున్నారు. ఈ వెబ్ సిరీస్ లో సన్నీ లియోన్ నటిస్తుందట. ఇప్పటికే టీజర్ ను కూడా విడుదల చేసారు. మరి ఈ వెబ్ సిరీస్ ఎలాంటి సంచలనం రేపుతోందో చూడాలి.

Comments