సన్నీ పాప మోజులో జేబులు ఖాళీ చేసుకుంటున్నారుగా..!

Sunday, October 22nd, 2017, 05:14:15 PM IST

కొంత కాలం గ్యాప్ తరువాత రాజశేఖర్ నటించిన చిత్రం ‘పి ఎస్ వి గరుడ వేగ’. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవలే బాలయ్య చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ఉన్న మరో ఆకర్షణ శృంగార సుందరి సన్నీలియోన్. ఈమె ఈ చిత్రంలో ఐటెం సాంగ్ లో మెరవనుంది. సన్నీకి కుర్రకారులో ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆమె చేత ఐటెం సాంగ్ చేయించారు. ఈనెల 27 హైదరాబాద్ లో జరగనున్న గరుడవేగ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సన్నీ లైవ్ పెర్ఫామెన్స్ చేయాల్సి ఉంది.

దీనికోసం చిత్ర యూనిట్ ఆమెని సంప్రదించగా భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా చివరకు నిర్మాతలు సన్నీని కొంత మొత్తానికి ఒప్పించారు. కానీ అందులో కూడా సన్నిలియోన్ కండిషన్ పెట్టిందట. పూర్తి సాంగ్ కి పెర్ఫామ్ చేయనని చెప్పేసిందట. అంటే సన్నీ మెరుపులు కాసేపు బిట్ సాంగ్ లో కనిపించనున్నాయి. గతంలో పూరిజగన్నాథ్ రోగ్ చిత్రం కోసం డాన్స్ పెర్ఫామ్ చేసిన సన్నీలియోన్ నిర్మాతల నుంచి బాగానే డబ్బు వసూలు చేసింది. బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకున్న సన్నీని టాలీవుడ్ కు తీసుకుని రావాలంటే నిర్మాతల జేబులు ఖాళీ కావలసిందే.

  •  
  •  
  •  
  •  

Comments