స్టన్నింగ్ పోస్టర్ : మహారాణిలా సన్నీ అదిరిపోయిందిగా…

Saturday, May 19th, 2018, 12:23:07 AM IST

బాలీవుడ్ స్టన్నింగ్ స్టార్ సన్నీ వినూత కథానికలతో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తుంది. ఐతే సినిమా లేకపోతె ఐటం సాంగ్ ఏదైనా సరే తెరపైకి ఎక్కిందంటే అభిమానుల నుండి థియేటర్లలో విజిల్సే. ఇప్పుడు మళ్ళీ అదే కోవలో ఓ కొత్త పాత్రతో తెరపైకి రానుంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో మహారాణిగా అవతరించనున్న సన్నీ ఈ సినిమాలో ఒక యుద్ద భూమిలో చెలరేగే మహారాణిగా ఇప్పుడు మనందరినీ అలరించనుంది. ప్రముఖ తమిళ దర్శకుడు వీసీ వదివుడయన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా సన్నీ ప్రధాన పాత్రలో ఒక లేడీ ఓరియంటడ్ ఫార్మేషన్ లో తెరపైకి రానుంది. తమిళంలో వీరమాదేవి అని సినిమాకు టైటిల్ ఫిక్స్ చేయగా తెలుగులో వీరమహదేవి అని పెట్టారు.

తెలుగు, తమిళం, మళయాళ భాషల్లో రానున్న ఈ సినిమా హిందీ డబ్ కూడా చేసే ఆలోచనలో ఉన్నారట ఈ చిత్ర నిర్మాతలు. నటించింది ఇంటర్నేషనల్ స్టార్ అయినందున అంచనాలు భారీగా ఉండటంతో ప్రపంచవ్యాప్తబ్గా ఈ సినిమాను విడుదల చేయనున్నారట. గుర్రంపై స్వారీ చేస్తూ మహా గంభీరమైన ఫోస్ తో యుద్ద ఆవరణలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్. తెలుగు నటుడు నవదీప్, నాజర్ లు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం విశ్లేషకరం. సినిమాకు సంబందించిన తీజర్ ను త్వరలోనే చిత్ర యూనిట్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments