డైరెక్టర్ గా సన్నీ లియాన్

Thursday, November 24th, 2016, 12:06:19 PM IST

sunny
ఐదారు సంవత్సరాలకి పూర్వం పోర్న్ ప్రపంచం లో రారాణి గా ఎదిగిన సన్నీ లియాన్ అప్పట్లో ఏకంగా యాభై కి పైగా పోర్న్ సినిమాలు చేసి పారేసింది. వాటిల్లో ఆమె ఓన్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు బోలెడు ఉన్నాయి. ఆ తరవాత బాలీవుడ్ లో అడుగు పెట్టాక పోర్న్ సినిమాల జోలికి కూడా వెళ్ళని సన్నీ లియాన్ ఇప్పుడు హాట్ హాట్ సినిమాలు చేస్తోంది. ఇప్పుడు మళ్ళీ ఆమెకి డైరెక్షన్ మీద మోజు వచ్చినట్టు ఉంది. ఇప్పటికే నిర్మాణం వైపు అడుగు వెయ్యాలని చూస్తున్న ఆమె డైరెక్షన్ కూడా తానే చెయ్యాలని అనుకుంటోంది. రాబోయే కొన్నేళ్లలో కచ్చితంగా డైరెక్షన్ చేసి తీరుతానని ఆమె స్పష్టం చేసింది. ఇంతకీ ఏ తరహా సినిమాలు తీయాలనుకుంటున్నారు అని అడిగితే.. రొమాంటిక్ ఎంటర్టైనర్ అని బదులిచ్చింది సన్నీ. మరి రెగ్యులర్ సినిమాలు తీసేంత పరిజ్నానం సంపాదించేశారా అని సన్నీని అడిగితే.. బాలీవుడ్లోకి వచ్చాక సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపైనా అవగాహన పెంచుకోవాలనుకున్నానని.. సినిమాలు చేస్తున్న కొద్దీ ప్రొడక్షన్.. డైరెక్షన్ వంటి విషయాలపై మంచి అవగాహన వచ్చిందని సన్నీ చెప్పింది. వెంటనే కాకపోయినా.. భవిష్యత్తులో తాను సినిమా తీయడం ఖాయమని తెలిపింది సన్నీ. మరి ఆమె మదిలో ఎలాంటి ఆలోచనలున్నాయో.. ఆమె ఎలాంటి సినిమాలు తీస్తుందో చూడాలి.