తన బయోపిక్ ని తానె తీస్తానంటున్న సన్నీ ?

Friday, September 30th, 2016, 01:12:46 AM IST

sunny1
బాలీవుడ్ హాట్ పాప సన్నీ లియోన్ క్రేజ్ ఈ మధ్య కాస్త తగ్గినట్టుంది. ఇదివరకటిలా ఆమెకు వరుస అవకాశాలు రావడం లేదు. పైగా సన్నీ నటించిన సినిమాలు, ఐటెం సాంగ్స్ కూడా ఎక్కడ కనిపించడం లేదు. దానికి తోడు ఈ భామకు బాలీవుడ్ లో హీరోయిన్ గా నటించాలనే కోరిక మాత్రం ఇంకా తీరలేదు. ఎందుకంటే సన్నీ హీరోయిన్ గా నటిస్తానంటే ఎవరు చూస్తారు చెప్పండి? ఆమెను అందరు చూసే యాంగిల్ వేరు ? ఇక ఈ మధ్య సన్నీ లియోన్ పై ”మోస్ట్లీ సన్నీ” అనే డాక్యూమెంట్ ను తీశారు. సన్నీ జీవిత కథతో తెరకెక్కిన ఈ డాక్యూమెంట్ ను చూసి సన్నీ నిరాశ చెందిందట !! చాలా నిరాశ గా ఉంది ఈ ఫిలిం .. అసలు విషయం ఏమి లేకుండా తీశారు అని చెప్పిన ఈ భామ తన లైఫ్ స్టోరీ ని అదే బయోపిక్ ని తానె సొంతంగా రూపొందిస్తా అని చెప్పింది? మరి ఆమె లైఫ్ స్టోరీ సొంతంగా తీస్తే ఎలాంటి సంచలనాలు రేపుతుందో చూడాలి !!