ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా: సన్నీ లియోన్

Saturday, April 14th, 2018, 05:26:24 PM IST

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన వ్యక్తి గత జీవితం గురించి అప్పుడపుడు చెప్పే కొన్ని మాటలు నిజంగా చాలా ఆసక్తిని కలిగిస్తాయి. ఎంత సినిమా తారా అయినప్పటికీ సమాజం పట్ల బాధ్యత ఉన్నట్లుగా ఎంతో పాజిటివ్ గా స్పందిస్తుంటారు. రీసెంట్ గా సంచలనం సృష్టించిన జమ్ముకశ్మీర్‌ కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారి ఘటనపై కూడా పరోక్షంగా స్పందించింది. సన్నీ లియోన్ తన దత్త పుత్రిక అయిన నిషాను హత్తుకొని ఒక ట్వీట్ చేసింది. నా మనస్సు శరీరం మరియు ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ప్రపంచంలోని చెడు నుంచి ఆమెను రక్షించుకుంటాను. నా జీవితాన్ని మొత్తం తన రక్షణం కోసం అంకితం చేస్తానని చెబుతూ.. పిల్లల్ని మనమందరం జాగ్రత్తగా చుసుకుంటూ కాపాడుకుందామని బావోద్వేగపూరితంగా ట్వీట్ చేసింది. ప్రస్తుత అందుకు సంబందించిన ఫొటో మరియు ట్వీట్ కు నెటిజన్స్ మద్దతు పలుకుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments