వెబ్ సిరీస్ వార్‌ : వ‌ర్మ‌కు, ఆ శృంగార‌తార‌కు స‌న్నీ థ్రెట్‌?

Wednesday, January 24th, 2018, 12:36:52 PM IST

వివాదాల రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం `గాడ్ సెక్స్ అండ్ ట్రూత్`(జీఎస్టీ) అంటూ హ‌డావుడి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌తో శృంగార‌తార మియా మాల్కోవాని తెలుగువారికి త‌న‌దైన శైలిలో కొత్త‌గా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు. భార‌త‌దేశంలో శృంగార సినిమాల‌కు ఆద‌ర‌ణ పెరిగింద‌ని ప్ర‌చారం చేస్తూ, త‌న‌కు కావాల్సిన యూట్యూబ్‌ టీఆర్పీని గుంజుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ గురించి ప్ర‌తి టాపిక్ గూగుల్‌లో ట్రెండింగ్ అవుతోంది.

అయితే వ‌ర్మ‌కు, స‌ద‌రు సెక్సిణికి చెక్ పెట్టేసేందుకు మ‌రో శృంగార తార స‌న్నీలియోన్ సిద్ధ‌మ‌వుతోంది. ఈ అమ్మ‌డు త్వ‌ర‌లోనే ఓ వెబ్ సిరీస్‌లో న‌టించ‌బోతోందిట‌. స‌న్నీ అంటేనే హీటెక్కించ‌డం.. అస‌లే అడ్డూ ఆపూ లేని వెబ్ సిరీస్‌ల‌తో ఏం చేసినా చెల్లుతుంది. అందుకే ఇక వ‌ర్మ‌కు థ్రెట్ మొద‌లైన‌ట్టేన‌ని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది. ప్ర‌ఖ్యాత జీ-చానెల్ స‌న్నీతో వెబ్ సిరీస్ కోసం ఒప్పందం చేసుకునేందుకు మంత‌నాలు సాగిస్తోంది. ఒక‌వేళ స‌న్నీ వెబ్ సిరీస్ ప్రారంభిస్తే ఇద్ద‌రు శృంగార తార‌ల మ‌ధ్య పోటీగా దీనిని అభిమానులు భావిస్తారు. ఆ మేర‌కు ఒక‌రితో ఒక‌రికి కాంపిటీష‌న్ పెరుగుతుంది. త‌ద్వారా హీట్ కంటెంట్ కూడా పెరుగుతుంద‌ని స‌న్నివేశం తెలియ‌జెబుతోంది.