షాక్‌ : పొలంలో దిష్టి బొమ్మ‌గా మారిన స‌న్నీలియోన్‌!

Wednesday, February 14th, 2018, 02:52:47 PM IST

విలేజీల్లో ర‌క‌ర‌కాల సెంటిమెంట్లు ఉంటాయి. అందులో క‌ను దిష్టి అనేది రెగ్యుల‌ర్‌గా వినేదే. క‌నుదిష్ఠి వ‌ల్ల ప‌చ్చ‌ని పైరు కూడా భ‌గ్గుమ‌నిపోతుంద‌ని చెబుతుంటారు పెద్ద‌లు. అయితే నెల్లూరుకు చెందిన 45 ఏళ్ల‌ రైతు క‌నుదిష్ఠి నుంచి త‌న ప‌దెక‌రాల పొలాన్ని కాపాడుకునేందుకు వేసిన ఎత్తుగ‌డ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

అస‌లే ఈ ఏడాది ప‌దెక‌రాల పొలంలో ప‌చ్చ‌ని పైరును ఏపుగా పెంచాడు. జ‌నం క‌ళ్లు త‌న పొలంపైనే ఉంటే అది న‌ష్టాన్ని క‌లిగిస్తుంద‌ని భావించిన అత‌డు ఏకంగా జ‌నాల చూపును మ‌రల్చేందుకు పొలంలో స‌న్నీలియోన్ ఫ్లెక్సీ ఒక‌టి త‌గిలించాడు. ఆ ఫ్లెక్సీ మీద `ఒరేయ్ న‌న్ను చూసి ఏడ‌వకురా!` అన్న క్యాప్ష‌న్ పెట్టించాడు. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఇదే. ప‌చ్చ‌ని పొలంలో ఉన్న ఈ ఫ్లెక్సీని చూసి జ‌నం సంతృప్తి చెందుతున్నారుట‌. దానివ‌ల్ల జ‌నం దిష్టి కూడా త‌న పొలానికి త‌గ‌ల‌డం లేదు. మొత్తానికి ఏదోలా త‌న పొలాన్ని కాపాడుకునే మార్గం అత‌డికి తెలిసింది. ప్ర‌స్తుతం ఏపీ వ్యాప్తంగా నెల్లూరులో ఓ రైతు స‌న్నీ పోస్ట‌ర్‌ని పొలానికి కాప‌లా పెట్టుకున్నాడు అంటూ ఒక‌టే ప్ర‌చారం సాగుతోంది.. చెడ్డ‌వాళ్ల క‌న్ను దిష్టి త‌గ‌ల‌కుండా ఇలా కూడా చేయొచ్చా? అన్న సందేహాన్ని రేకెత్తించింది. హౌ క్రియేటివ్ రైతు.. నువ్వు కేకయ్యా.