ఉన్న‌వ‌న్నీ అమ్మేస్తున్న స‌న్నీ

Tuesday, May 22nd, 2018, 09:26:50 PM IST

శృంగార‌తార స‌న్నీలియోన్ అమ్మ‌కాలు మామూలుగా లేవు. ఒక ఫ‌క్తు ఎంట‌ర్‌ప్రెన్యూర్ ఏ తీరుగా వ్య‌వ‌హ‌రించాలో, ఓ కంపెనీ సీఈవో ఏ తీరుగా సంస్థ‌ను ర‌న్ చేయాలో స‌న్నీని అడిగి తెలుసుకోవాలి. మ్యానేజ్‌మెంట్‌లో ఏ డిగ్రీ చేసింది స‌న్నీలియోన్ అన్న ప్ర‌శ్న వ‌ద్దే వ‌ద్దు. ఈ భామ తొలుత సామాజిక మాధ్య‌మాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అటుపై సొంతంగా స్టార్ స్ట‌క్ సౌంద‌ర్య ఉత్ప‌త్తుల ఫ్రాంఛైజీని ప్రారంభించింది. ప్ర‌స్తుతం ఈ కంపెనీకి సామాజిక మాధ్య‌మాల్లో విస్త్ర‌తంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది.

లేటెస్టుగా ట్విట్ట‌ర్‌లో స్టార్ స్ట‌క్ క‌ల‌ర్ కాంబినేష‌న్ గురించి లెక్చ‌ర్లు ఇచ్చింది. ఆ క్ర‌మంలోనే స‌న్నీ .. తాను అయితే ఎలాంటి క‌ల‌ర్ కాంబినేష‌న్స్ ఉప‌యోగిస్తుందో నేరుగా ఫోటోల్ని పోస్ట్ చేయ‌డం ద్వారా యూత్‌కి సందేశం ఇచ్చింది. టాప్ టు బాట‌మ్ బ్లూలో క‌నిపిస్తే, అందుకు త‌గ్గ‌ట్టే ఎరుపురంగు లిప్‌స్టిక్ వాడండి! అది మా స్టార్ స్ట‌క్ ఉత్ప‌త్తి అయితే మ‌రీ మంచిది! అని సెల‌విచ్చింది. `స్టార్రీ నైట్‌` వేళ .. స్టార్ స్ట‌క్ క‌ల‌ర్స్ .. ఎలా ఉన్నాయ్‌?.. అంటూ స‌న్నీ క్వ‌శ్చ‌న్ చేసింది. బాప్ రే.. ఓవైపు సినిమాలు, ఇంకోవైపు స్టార్ స్ట‌క్‌, వేరొక వైపు బుల్లితెర సిరీస్‌లు.. స‌న్నీ లైఫ్ మూడు పువ్వులు ముప్పై కాయ‌ల్లా వెలిగిపోతోంది. క‌ర‌ణ్ జీత్ కౌర్ బ‌యో సిరీస్ పేరుతో స‌న్నీ ఇప్ప‌టికే జ‌నంలో హాట్ టాపిక్ అయ్యింది.

  •  
  •  
  •  
  •  

Comments