సూపర్ ప్లాన్ వేసిన జగన్ – టీడీపీతో పాటే బీజేపీకి కూడా చుక్కలేనా…?

Thursday, July 18th, 2019, 12:57:28 AM IST

ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకున్నప్పటినుండి కూడా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చాలా దూకుడుగా ప్రవర్తిస్తూ తన పాలనలో ఎదురు లేకుండా దూసుకుపోతున్నాడు. అయితే జగన్ చూపించే ఈ అత్యుత్సాహం అనేది పలువురు విపక్ష నేతలందరికీ కూడా చాలా ఇబ్బందిగా మారిందని చెప్పాలి. అయితే జగన్ ప్రవర్తనతో ఇబ్బందికి గురైన పలువురు విపక్ష నేతలు ఎలాగైనా జగన్ దూకుడుకు కళ్లెం వేయాలని చూస్తుంది. అందులో బీజేపీ పార్టీ ముందు వరుసలో ఉందని చెప్పాలి. ఎలాగైనా సరే జగన్ దూకుడుకి అడ్డుగోడను నిర్మించాలని, అందుకోసం ప్రత్యేకమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది అని సమాచారం. అయితే సెంట్రల్ పవర్ మినిస్టర్ ఆర్‌కె సింగ్ కూడా ఈ విషయం గురించే గతంలో తీవ్రంగానే ప్రస్తావించాడు. దానికి కారణం కూడా లేకపోలేదు.

కేవలం ఒకేఒక్క విషయంలో మాత్రం బీజేపీ పార్టీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పాలి. ‘బాబుగోరి ప్రభుత్వం పవర్ ప్రాజెక్ట్‌ల విషయంలో పీపీఏల ఒప్పందాల్ని రద్దు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఐతే ఇదే విషయంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతికిస్తుందని చెప్పాలి. అయితే అలా చేస్తే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రావని కేంద్ర మంత్రి ఏపీ సర్కారును హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఒప్పందాల్ని రద్దు చేయాలనీ జగన్ ప్రయత్నిస్తుండడంతో కేంద్రమంత్రి రంగంలోకి దిగి, పీపీఏల ఒప్పందాల పై ఆలోచన మార్చుకోవాలని జగన్ కి చెప్పుకొచ్చారు. అయితే అప్పుడు వారి మాటలకి ఒప్పుకున్న జగన్, ఇప్పుడు మళ్ళీ అదే పని చేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, జగన్ తీసుకున్న నిర్ణయం పై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి…