“సుడిగాలి సుధీర్” స్కిట్ కి అనూహ్యమైన స్పందన.!

Saturday, October 6th, 2018, 11:22:42 AM IST

బుల్లితెర పై ఎన్ని వినోదాత్మక షోలు, రియాలిటీ షోలు ఉన్నా ఈ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ కామెడీ షోలకి వచ్చే స్పందనే వేరు అని చెప్పాలి,ఒక పక్క టీఆర్పీ రేటింగ్ల విషయంలో కానీ మరో పక్క యూట్యూబ్ లో వీక్షకుల సంఖ్య పరంగా కానీ నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఎప్పుడూ ఉంటాయి.ఒకరిని తలదన్నే మరొకరి కామెడీతో అశేష తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తారు. అందులోని కమెడియన్లు.మొన్ననే చూసుకున్న ప్రోమోల విషయంలోనే 50 లక్షల వ్యూస్ కొల్లగొట్టేసిన రెండు షోలు ఇప్పుడు టీవీల్లో కూడా హవా చూపుతున్నాయి.నిన్న ప్రసారమైన సుడిగాలి సుధీర్ స్కిట్ ఐతే ప్రేక్షక జనం కడుపుబ్బా నవ్వుకున్నారు.

జీవితంలో సాధారణంగా జరిగే సంఘటనల మీదనే వీరు ఎక్కువగా స్కిట్ రాసుకుంటారు.ఇప్పుడు కూడా రామ్ ప్రసాద్ అలాగే తన పుట్టిన రోజు జరుపుకునే విషయంలో తన స్నేహితులకి తనకి మధ్యలో జరిగే సన్నివేశాలను వినోదాత్మకంగా రాసుకొని ప్రదర్శితం చేశారు.ఇప్పటికే ఎన్నో సినిమాల్లో వినోదాత్మక పాత్రలు చేసినటువంటి జగదీశ్వరి గారు ఈ స్కిట్ లో అతిధిగా వచ్చి భీభత్సంగా నవ్వించారు.రామ్ ప్రసాద్ ఎప్పటిలాగానే తన ఆటో పంచులతో,గెటప్ శ్రీను,సుధీర్ లు వారి శైలి కామెడీతో జనాన్ని, నాగబాబు రోజా గార్లని పొట్ట పగిలేలా నవ్వించారు.దీనితో నిన్నటి షోలో బెస్ట్ స్కిట్ గా వీరి స్కిట్ కు 10 మార్కుల బోర్డ్ ఎత్తారు.ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో సంచలనంగా మారింది,మీరు చూడకపోతే ఒక చూసి మనసారా నవ్వుకోండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

  •  
  •  
  •  
  •  

Comments