కరోనా దెబ్బకి ప్లాన్ మార్చిన “సర్కారు వారి పాట”… షూటింగు ఎక్కడంటే?

Sunday, April 4th, 2021, 04:38:38 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం అంతా కూడా బ్యాంకింగ్ రంగం లో జరిగే అవినీతి అక్రమాల గురించి ఉండనుంది. అయితే మహేష్ బాబు చాలా రోజుల తరువాత ఒక మాస్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మహేష్ లుక్ కి మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం కి తాజాగా కరోనా దెబ్బ పడింది అని తెలుస్తోంది. అయితే సర్కారు వారి పాట చిత్రకరణ కోసం చిత్త యూనిట్ అంతా కూడా గోవా వెళ్ళాలి అని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్ కాస్తా రివర్స్ అయ్యింది.

సినిమా కి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలను గోవా లో చిత్రీకరించాలని టీమ్ భావించింది. అయితే కరోనా వైరస్ ప్రభావం అక్కడ ఇంకా ఎక్కువగా ఉండటం తో ఆ ప్లాన్ ను విరమించింది. అయితే ఈ నెల 15 న హైదరాబాద్ లో షెడ్యూల్ మొదలు పెట్టి, దాదాపు 25 రోజుల పాటు అక్కడే చిత్రీకరణ జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. పరశురామ్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తీ సురేష్ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కి ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే.