అనిరుధ్ గా వస్తున్న ‘సూపర్ స్టార్ మహేష్’!

Monday, July 23rd, 2018, 11:47:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆయన కెరీర్లో సూపర్ హిట్ లతో పాటు ప్లాప్ చిత్రాలు కూడా వున్నాయి. అయితే మిగతా హీరోలతో పోలిస్తే మహేష్ కి మాత్రమే వున్న స్టార్డం మరియు చరిష్మా వేరనే చెప్పుకోవాలి. ఆయన ఎటువంటి ఇతర భాష చిత్రాల్లో నటించనప్పటికీ కూడా అయన జాతీయ స్థాయిలో సుపరిచితమే. ఆయన గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ మాన్ కాంటెస్ట్ లలో తన సత్తా చాటుతున్నారు. ఇక ఇటీవల భరత్ అనే నేనుతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన సూపర్ స్టార్, ప్రస్తుతం తన కెరీర్ లోనే ప్రతితిష్టత్మక 25వ చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే రెండేళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోర పరాజయాన్ని చవిచూసిన ఆయన సినిమా ‘బ్రహ్మోత్సవం’.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం అద్భుత విజయం తరువాత, మళ్ళి ఆయన శ్రీకాంత్ అద్దాలకు ఈ చిత్రం అవకాశం ఇచ్చారు. అప్పట్లో మంచి క్రేజ్ తో విడుదలయిన ఈ సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం తమిళ్ లో ఈ చిత్రాన్ని ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. స్పైడర్ సినిమా తరువాత మహేష్ బాబుకు తమిళ నాట సూపర్ క్రేజ్ రావడంతో నిర్మాతలు దీనిని డబ్ చేసి ‘అనిరుధ్’ పేరుతో అక్కడ విడుదల చేస్తున్నారు. ఇటీవలి భరత్ అనే నేను కూడా తమిళ్ లో సంచలన విజయం అందుకోవడంతో నిర్మాతలు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తెలుగులో ప్లాప్ అయిన ఈ చిత్రం అక్కడ ఏమేరకు విజయం అందుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగవలసిందే…..

  •  
  •  
  •  
  •  

Comments