మరి కొంత మందిని ఫాలో అవుతున్న సూపర్ స్టార్ మహేష్!

Sunday, May 27th, 2018, 12:12:47 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకు వున్న క్రేజ్ ఫాలోయింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇదివరకు కొంత రిజర్వేడ్ వుంటారనే ముద్ర నుండి బయటపడిన ఆయన కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో తన చిత్రాల, అలానే ఫ్యామిలీకి సంబందించిన వివరాలను తరచు తెలియచేస్తూ, పోస్ట్ లు పెడుతుంటారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో 6.52 మిలియన్ల ఫాల్లోవర్లను కలిగివున్న ఆయన తాను ఫాలో అవుతున్న వారి విషయంలో మాత్రం కేవలం అయన బావ అయిన జయదేవ్ గల్లా ను మాత్రమే ఫాలో అయ్యేవారు.

అయితే ఆ తరువాత కొద్దిరోజుల క్రితం తనకు శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలతో అడ్డుతా విజయాలు అందించిన కూడా ఫాలో అయ్యారు. కాగా నిన్న ఆయన మొరొక ఆరుగురిని ఫాలో అవుతూ మొత్తం తాను ఫాలో అయ్యేవారి సంఖ్యను 8 కి పంచుకున్నారు. క్రికెట్ అంటే మొదటినుండి అమితంగా ఇష్టపడే మహేష్ బాబు తాను రీసెంట్ గా ఆడ్ చేసుకున్న ఫాలోవర్స్ లో ప్రముఖ క్రికెటర్లే ఎక్కువ ఉండడం విశేషం. వారిలో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి, ప్రముఖ రచయిత టోనీ రాబిన్స్ లను ఫాలో అవుతున్నారు. కాగా ప్రస్తుతం తన కుటుంబంతో సహా స్పెయిన్ లో విహారయాత్రలో వున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments