సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫాన్స్ వెరైటీ బర్త్ డే గిఫ్ట్!

Monday, April 30th, 2018, 10:34:17 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం విడుదలవుతుందంటేనే ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆ చిత్రం ఎలావుంటుంది అని ఆసక్తి కనబరుస్తుంటారు. ఆయన హీరోగా ఇటీవల విడుదలయిన భరత్ అనే నేను చిత్రం మొదటి రోజు నుండి అద్భుతమైన టాక్ తో సూపర్ డూపర్ హిట్ దిశగా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన అభిమానులు ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజుకి కేక్ కట్టింగ్స్, అన్నదానాలు ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందునుండి సోషల్ మీడియాలో సందడి మొదలెట్టే ఆయనే అభిమానులు, ఈ సంవత్సరం ఆయనకు భరత్ అనే నేను రూపంలో సూపర్ హిట్ రావడంతో ఆయన పుట్టినరోజుకి ఇంకా చాలా సమయం ఉండగానే ఇప్పటినుండే వారు సెలెబ్రేషన్స్ మొదలు పెట్టారు.

మహేష్ పుట్టిన రోజు సరిగ్గా ఇవాల్టినుండి 100 రోజులు ఉండడంతో కొన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ను ఫాన్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. #100DaysToSovereignSSMBBDay హాష్ టాగ్ తో ప్రస్తుతం ఆ పోస్టర్స్ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో విపరీతంగా ట్రెండ్ అవుతూ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. కాగా మహేష్ పుట్టినరోజుకు చాలా సమయం ముందు నుండే ఈ విధమైన గిఫ్ట్ సూపర్ స్టార్ కి ఇచ్చినందుకు పలువురు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఇమేజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు మరి…..

  •  
  •  
  •  
  •  

Comments