బాలయ్య సినిమాలో సూపర్ స్టార్ గెస్ట్ రోల్ ?

Tuesday, April 10th, 2018, 10:13:53 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే అయన నటించేది కూడా తన తండ్రి కృష్ణ పాత్రలో కావడం విశేషం !! ఆ వివరాల్లోకి వెళితే నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా నందమూరి బాలకృష్ణ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా పూజ కార్యక్రమాలతో ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు అప్పట్లో హీరోలుగా క్రేజ్ తెచ్చుకున్న అక్కినేని, కృష్ణ, ఎంజీఆర్ లాంటి వాళ్ళు కూడా కనిపిస్తారట. అందులో ఎంజీఆర్ పాత్రకోసం ఇప్పటికే ఓ నటుడిని ఎంపిక చేసారు. తాజాగా హీరో కృష్ణ పాత్రలో అయన తనయుడు మహేష్ ని నటింప చేయాలనీ తేజ ప్లాన్ చేసాడట. ఈ విషయం పై ఇప్పటికే తేజ, మహేష్ ని సంప్రదించాడని , దానికి మహేష్ కూడా ఓకే అని చెప్పాడని టాక్. ఒకవేళ మహేష్ కూడా ఇందులో నటిస్తే ఆ సినిమా క్రేజ్ మరోలా ఉంటుంది మరి. ఈ విషయం పై త్వరలోనే అధికారిక వివరాలు వెలువడే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments