సూపర్ స్టార్ లక్ష్యం అదిరింది బాసూ ?

Thursday, May 10th, 2018, 10:11:25 AM IST

సూపర్ స్టార్ రజని కాంత్ హీరోగా నటించిన కాలా సినిమాలోని పాటలు నిన్న చెన్నై లో విడుదల అయింది. ఈ వేదిక పై సూపర్ స్టార్ మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. రాజకీయంగా ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ ఏమన్నాడో తెలుసా .. తాను చనిపోయేలోగా దక్షిణాదిలో ఉన్న నదులన్నింటిని అనుసంధానించాలని అన్నాడు. నిజమే .. నదులన్నీ కలిస్తే .. ఎక్కడ నీటి కొరత ఉండదు. తాను హిమాలయాలకు వెళ్ళడానికి ముఖ్య కారణం గంగానదిని చూడడానికే అన్నాడు. ఇక కాలా సినిమాను రంజిత్ అద్భుతంగా తీర్చి దిద్దాడని ఈ వేడుక పాటల వేడుకలా కాకూండా విజాయోత్సవ సభలా ఉందంటూ చెప్పాడు. ఇక త్వరలోనే రజనీకాంత్ తన రాజకీయ పార్టీని సంబందించిన ప్లాన్ ను ప్రకటించే అవకాశం ఉంది.