ఆసక్తి రేకెత్తిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా..!

Friday, September 7th, 2018, 03:31:31 PM IST

సూపర్ స్టార్ “రజినీకాంత్” ప్రపంచం లో ఈ పేరు తెలీని భారతీయుడు ఉండడు. తమిళనాడు ప్రజలు ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు. ఆయన క్రేజ్ మాటల్లో చెప్పలేనిది ప్రపంచవ్యాప్తంగా ఆయనకీ అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన “కబాలి” అట్టర్ ప్లాప్ అయినా సరే ఆ సినిమా కి వచ్చిన వసూళ్లు చూస్తేనే బాక్సఫీసు వద్ద ఆయన సత్తా ఏంటో తెలుస్తుంది.

ఐతే ఇప్పుడు ఆయన తర్వాత చెయ్యబోయే సినిమా కోసం ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది, ఆ విషయాన్ని సన్ పిక్చర్స్ వారు వారి ట్విట్టర్ అకౌంట్ ద్వారా రజినీకాంత్ నటించబోయే 165 వ సినిమాగా పేర్కొంటున్నారు. ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ ని మరియు మోషన్ పోస్టర్ ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు వారి ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చేస్తున్నట్టు తెలియజేసారు. ఈ చిత్రం లో విజయ్ సేతుపతి, త్రిష మరియు సిమ్రాన్ కూడా నటిస్తున్నట్టు వార్త. ఈ చిత్రానికి అద్భుత సంగీత దర్శకుడు అనిరుద్ నియమించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి. నవంబర్ 26న శంకర్ దర్శకత్వం వహించిన 2.0 కోసం కూడా ఈ ప్రపంచ సినీ అభిమానులు వేచి చూస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments