చాలా కాలం తరువాత చెన్నైలో అడుగుపెట్టిన రజినీకాంత్

Saturday, May 5th, 2018, 04:48:03 PM IST

సూపర్ స్టార్ రాజినీకాంత్ చాలా కాలం రోజుల తరువాత చెన్నైలో అడుగుపెట్టాడు. గత కొంత కాలంగా చిన్నపాటి అస్వస్థతకు బాధపడుతున్న రజినీకాంత్ చిక్కిత్స కోసం అమెరికాకు వెళ్లారు. రాజకీయాలల్లో బిజీ అయ్యే ముందు గతంలో ఆయన హిమాలయాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. రోజు ధ్యానం చేసుకుని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న రజిని కొంచెం అస్వస్థకు గురయ్యారు. వెంటనే తన పర్సనల్ వైద్యులు చిక్కిత్స కోసం అమెరికాకు వెళ్లాలని సూచించడంతో రజినీకాంత్ అమెరికాకు వెళ్లి గత కొన్ని రోజులుగా అక్కడే రెస్ట్ తీసుకొని నేడు తిరిగి భారత్ కి చేరుకున్నారు.

చెన్నై లో రజినీకాంత్ అడుగుపెట్టగానే అభిమానులు వందల సంఖ్యలో చెన్నై విమాశ్రయం దగ్గరకు చేరుకొని ఘన స్వాగతం పలికారు. అభిమానులను చూసిన రజిని సంతోషంతో అభివాదం తెలుపుతూ తన స్వగృహానికి చేరుకున్నారు. ఇంట్లోకి వచ్చే ముందు రజినీ కాంత్ కి ఆయన సతీమణి హారతి ఇచ్చింది. ఇక రజినీకాంత్ నెక్స్ట్ సినిమా కాలా – 2.0 సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే రజినీకాంత్ తన రాజకీయ ప్రణాళికలను కూడా ప్రజలకు తెలియజేయనున్నారు. ప్రస్తుతం ఆయన సన్నిహితులతో అందుకు తగిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుపుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments