సూపర్ స్టార్ టార్గెట్ రూ.100 కోట్లు

Sunday, April 15th, 2018, 11:43:33 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో కైరా అద్వానీ హీరోయిన్ గా డివివి దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం భరత్ అనే నేను. ఇప్పటికే విడుదలయిన ఈ చిత్రం పాటలు, అలానే ట్రైలర్ కు వీక్షకులనుండి అద్భుత స్పందన లభిస్తోంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. తన గత సినిమాల ఫలితాల ప్రభావం ఇంచు కూడా లేకుండా అంతకంతకు క్రేజ్ పెంచుకుంటూ పోతున్న మహేష్ బాబు ష్యూర్ షాట్ హిట్ గా పాజిటివ్ ప్రీ రిలీజ్ టాక్ సొంతం చేసుకున్న భరత్ నేను నేను విశ్వసనీయ సమాచారం మేరకు 100 కోట్ల బిజినెస్ జరుపుకుంది. అంటే పెట్టుబడి వెనక్కు వచ్చి లాభాలు మొదలు కావాలి అంటే వీలైనంత త్వరగా వంద కోట్ల షేర్ వచ్చేయాలి.

హిట్ టాక్ వస్తే చాలు అది కొట్టడం ప్రిన్స్ కు ఏమంత కష్టం కాదు. ఈజీగా లాగేస్తాడు అని తెలుస్తోంది. ఓవర్సీస్ లో అవుట్ రైట్ గా 18 కోట్లకు సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు మొదటి రోజే 350 లొకేషన్లకు పైగా అలానే 2000 ప్రీమియర్ షోలను ప్లాన్ చేయడం చూస్తే 3 మిలియన్ మార్క్ చేరుకోవడం పెద్ద విశేషమేమి కాదు. రామ్ చరణ్ రంగస్థలంతో అది పది రోజుల్లోనే అందుకున్నాడు కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే భరత్ వారం లోపే లాగేసి అవకాశం కనపడుతోంది. ఇక ఏరియాల వారిగా జరిగిన ప్రీ బిజినెస్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. నైజాం – 22 కోట్లు సీడెడ్ – 12 కోట్లు ఉత్తరాంధ్ర – 8 కోట్ల 70 లక్షలు ఈస్ట్ – 6 కోట్ల 70 లక్షలు.

కృష్ణా మరియు గుంటూరు – 13 కోట్ల 60 లక్షలు వెస్ట్ – 6 కోట్లు నెల్లూరు – 3 కోట్లు తెలుగు రాష్ట్రాలు (మొత్తం)- 72 కోట్లు కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలు – 9 కోట్లు ఓవర్సీస్ – 18 కోట్లు ప్రపంచవ్యాప్తంగా – 99 కోట్లు. అయితే కేవలం యావరేజ్ టాక్ వస్తేనే ఈజీగా 60 కోట్లు లాగేస్తున్న మహేష్ బాబు ముందే ప్రీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న భరత్ అనే నేనుతో ఈ టార్గెట్ ని పెద్ద మార్జిన్ తో బీట్ చేస్తాడని అటు ఫాన్స్ తో పాటు ఇటు విశ్లేషకులు కూడా గట్టి నమ్మకంతో వున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఇది అగ్ని పరీక్షే మరి……