సూపర్ స్టార్ vs స్టైలిష్ స్టార్ ఎవరు ముందు?

Wednesday, January 24th, 2018, 05:33:45 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివతో చేస్తోన్న నూతన చిత్రం, అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో వక్కంతం వంశి తలొలి సారి మెగాఫోన్ పడుతోన్న నా పేరు సూర్య చిత్రాల విడుదల విషయం లో సందిగ్ధత రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట్లో బన్నీ చిత్ర నిర్మాతలు ఏప్రిల్ 27 న తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత చాన్నాళ్లకు మహేష్ బాబు నిర్మాతలు సడన్ గా తమ చిత్రాన్ని కూడా అదే తేదీన విడుదల చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే తమను కనీసం మాట మాత్రం కూడా అడగకుండా మహేష్ బాబు సినిమా నిర్మాతలు విడుదల తేదీ ప్రకటించడం పై నా పేరు సూర్య నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసు ఖండించారు. మాతో సంప్రదించి విడుదల తేదీ ప్రకటించి ఉంటే రెండిటికి మధ్య క్లాష్ రాకుండా మాట్లాడుకునేవాళ్లమని, కానీ ఇలా అర్ధాంతరంగా విడుదల తేదీ ప్రకటన సరైనది కాదని, కాబట్టి తమ చిత్ర విడుదల తేదీలో ఏ మాత్రం మార్పు లేదని ఆయన ఖరాఖండిగా తేల్చి చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మరొక పెద్ద చిక్కు వచ్చిపడింది. సూపర్ స్టార్ రజని కాంత్ నటిస్తున్న 2.0 చిత్రం కూడా ఏప్రిల్ లోనే విడుదల అవుతుందని ఆ నిర్మాతలు కూడా ప్రకటన ఒకటి ఇవ్వడం, ఆ తర్వాత అది 14 న లేక 27 న రెండిట్లో ఏతేదీన విడుదలవుతుందా అని అందరూ ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్లి నిన్నటినుండి నా పేరు సూర్య సినిమా కొద్దీ రోజులు ప్రీపోన్ అయిందని ఏప్రిల్ 14 న విడుదల తేధీగా నిర్ణయించారని వార్త ఒకటి బయటకి వచ్చింది. దీనితో మహేష్ సినిమాకు కొంతవరకు లైన్ క్లియర్ అయినట్లే అనుకున్నారు అంతా. అయితే ఇప్పుడు మళ్లి ఇదే విషయమై ఇవాళ కొందరు మీడియా మిత్రులు బన్నీ వాసు ను సంప్రదించగా తమ చిత్ర విడుదల తేదీలో ఎటువంటి మార్పు లేదని ఖచ్చితంగా ముందు చెప్పినట్లుగానే ఏప్రిల్ 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని అన్నట్లు తెలియవస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటివరకు రజిని సినిమా కూడా ఏప్రిల్ లోనే వుంది కాబట్టి మహేష్ బాబు సినిమా ను ఈ రెండిటి పోటీ మధ్య నిలపడం కరెక్ట్ కాదని మరింత ముందుకు జరిగి జూన్, లేదా జులై కి పోస్టుపోన్ చేస్తే బాగుంటుందని ఆ నిర్మాతలు అనుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రెండు చిత్రాల సంబంధించి చిత్ర బృందాలు అధికారిక ప్రకటనలు ఇచ్చే వరకు ఇలాంటి మీమాంస తప్పదని సినీ విశ్లేషకులు అంటున్నారు….