సూపర్ స్టార్ మహేష్ 27 ఫిక్స్ అయిందట?

Sunday, September 2nd, 2018, 04:36:22 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అయన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంగా ప్రస్తుతం మహర్షి చిత్రం రూపొందుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మున్నా, బృందావనం, ఊపిరి చిత్రాల ఫేమ్ వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, టాలీవుడ్ లోని అగ్రనిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్, పివిపిలు సంయుక్తంగా తమ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో అమెరికాలోని ప్రధాన నగరాల్లో షూటింగ్ చేసేందుకు బయలుదేరుతోంది. ఇక వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ టీమ్ ఇప్పటినుండే కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని తరువాత మహేష్ బాబు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తారు.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు నటించే 27వ సినిమా కూడా ఫిక్స్ అయిందని, కొద్దిరోజులనుండి అయన తన 27వ సినిమాని అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ చేస్తారనే వార్త షికారు చేస్తోంది. అయితే ఈ విషమయి నేడు క్లారిటీ వచ్చేసిందని, ఈ చిత్రానికి నేడు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, సందీప్ రెడ్డి కూడా అప్పుడే మూవీ స్క్రిప్ట్ పూర్తిగా డెవలప్ చేసేపనిలో కూడా పడ్డాడట. ఇకపోతే ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించనున్నట్లు సమాచారమా అందుతోంది. ఇప్పటికేవరకు బయటి స్టార్ హీరోలతో చిత్రాలు నిర్మించని గీత ఆర్ట్స్ సంస్థ తొలిసారిగా మహేష్ బాబుతో చిత్రం తీయడానికి ముందుకువచ్చిందని, ఈ చిత్రం విషయమై త్వరలో వారినుండి ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని అంటున్నారు. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వార్త ఒకవేళ నిజమే అయితే సూపర్ స్టార్ ఫాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి…..

  •  
  •  
  •  
  •  

Comments