హైద్రాబాద్ రానున్న కాలా ?

Thursday, May 24th, 2018, 09:46:45 PM IST


సూపర్ స్టార్ రజని కాంత్ తాజాగా నటించిన కాలా చిత్రం జూన్ 7న విడుదలకు సిద్ధం అయింది. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం కాలా అలియాస్ రజని కాంత్ హైద్రాబాద్ రానున్నాడు. ఇటీవలే చెన్నై లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్ లోకూడా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 29న హైద్రాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకలో సూపర్ రాజని కాంత్ పాల్గొంటున్నాడు. కబాలి సినిమా తరువాత రజని – పా రంజిత్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని భారీగా విడుదలచేయనున్నారు .

  •  
  •  
  •  
  •  

Comments