తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్!

Friday, April 20th, 2018, 01:42:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వం లో, కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న నూతన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ లెవల్లో, అత్యధిక థియేటర్ లలో విడుదలవుతున్న సంగతి అందరికి తెల్సిందే. అయితే ఇటీవల జరిగిన ఈ చిత్ర ఆడియో విడుదల వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆ వేడుక లో మహేష్ బాబు మాట్లాడుతూ, కాకతాళీయమో ఏమో తెలియదుగాని భరత్ అనే నేను సినిమా విడుదల అవుతన్నరోజే మా అమ్మ ఇందిరమ్మ గారి పుట్టిన రోజు అని ఆయన చెప్పారు. కాగా నేడు చిత్ర విడుదల సందర్భంగా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలూపుతూ ఆమె ఫోటో ని పోస్ట్ చేశారు…..

  •  
  •  
  •  
  •  

Comments