చెన్నై చేరుకున్న సూపర్ స్టార్ ?

Monday, May 7th, 2018, 10:58:31 AM IST

సూపర్ స్టార్ రజని కాంత్ చెన్నై చేరుకున్నారు. ఇటీవలే అయన హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేసుకుని, అక్కడే కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే, అటునుండి అమెరికా వెళ్లి రెగ్యులర్ మెడికల్ చెకప్ చేయించుకుని దాదాపు రెండు నెలల తరువాత చెన్నై కి చేరుకున్నాడు. చెన్నై చేరుకున్న రజనికి అక్కడి అభిమానులు ఘనంగా స్వగతం పలికారు. ఇక రజని కాంత్ నటించిన కాల సినిమా షూటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నెల 9 ఈ సినిమాలోని పాటలను విడుదల చేస్తారట. రజని నటించిన రోబో 2. 0 సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ తన రాజకీయానికి సంబందించిన కార్యక్రమాలను ప్రకటించే అవకాశం ఉంది.

Comments