జగన్ సర్కార్‌కి మరో షాక్.. స్థానికసంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్ట్ స్టే..!

Wednesday, January 15th, 2020, 05:07:13 PM IST

ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే తాజాగా ఈ ఎన్నికలకి సంబంధించి జగన్ సర్కార్‌కి సుప్రీం కోర్ట్ షాక్ ఇచ్చింది. అయితే ఈ ఎన్నికలపై 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 176పై న్యాయస్థానం స్టే విధించింది.

అయితే పంచాయితీ ఎన్నికలలో ఏపీ ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని తప్పుపట్టిన ఉన్నత న్యాయస్థానం దీనిపై నాలుగు వారాలలో పూర్తి విచారణ చేయాలని హైకోర్ట్‌ను ఆదేశించింది. అయితే గతంలో దాఖలైన పిటీషన్లను హైకోర్ట్ పట్టించుకోకపోవడంతో ఈ నెల 17వ తేదీన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఎన్నికల సంఘం రెడీ అయ్యింది. అయితే ఏపీ రెడ్డి సంఘం నేత ప్రతాప్ రెడ్డి ఈ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించి గతంలో రిజర్వేషన్లపై సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును కూడా పిటీషన్‌లో లేవనెత్తాడు. అయితే ఈ పిటీషన్‌పై స్పందించిన సుప్రీం కోర్ట్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమంటూ స్టే విధించింది.