జయలలిత కట్టాల్సిన 100 కోట్లు ఎవరు కడతారు ?

Friday, February 17th, 2017, 02:56:46 AM IST


అక్రమాస్తుల మీద సుప్రీం కోర్టు తన తీర్పు వెల్లడించిన వెంటనే అందరూ అన్న మాట జయలలిత చచ్చిపోబట్టి మిస్ అయ్యింది కానీ లేదంటే ఉన్న పళంగా సీఎం కుర్చీ ని కోల్పోయి వెంటనే జైలుకి వెళ్ళాల్సి వచ్చేది . అప్పట్లో అంటే రెండు సంవత్సరాల క్రితం కూడా సుప్రీం తీర్పు కి ఓకే చెబుతూ సీఎం పదవికి ఆమె రాజీనామా చేసి జైలుకి వెళ్ళిన సంగతి తెలిసిందే.అనంతరం సుప్రీంకోర్టుకు అప్పీల్ తో బయటకు వచ్చిన ఆమె.. మళ్లీ ముఖ్యమంత్రి కావటం.. సార్వత్రికఎన్నికల్లో ఘన విజయంతో మరోసారి సీఎం కావటం తెలిసిందే. అనారోగ్యంతో మరణించిన ఆమెను సైతం తాజా తీర్పులో దోషిగా నిర్ధారించిన విషయాన్ని మర్చిపోకూడదు. చనిపోవటంతో ఆమెకు విధించిన జైలుశిక్ష అమలు కాదు. ఈ సరికొత్త తీర్పు లో ఆమె కి విధించిన 100 కోట్ల జరిమానా సంగతి ఎవ్వరూ మాట్లాడకపోవడం చాలా బాధాకర విషయం. కింద కోర్టు లో ఇచ్చిన తీర్పు సుప్రీం ఖరారు చేసిన నేపధ్యం లో అమ్మకి వేసిన 100 కోట్ల జరిమానా కోసం ఆమె ఆస్తులు జప్తు చెయ్యాల్సి ఉంటుది. అమ్మకు వారసులంటూ ఎవరూ లేని వేళ.. ఈ భారీ మొత్తాన్ని ఎవరు చెల్లిస్తారు? ఎలా చెల్లిస్తారు? అన్నది సందేహంగా మారింది.