కొడుకులు తల్లితండ్రుల దయ మీదే బతకాలి – కోర్టు సంచాల తీర్పు

Wednesday, November 30th, 2016, 12:20:21 PM IST

suprem-court
డిల్లీ హై కోర్టు తాజాగా సంచలన తీర్పు చెప్పింది. తల్లి తండ్రులు సంపాదించిన కష్టంతో కట్టుకున్న ఇల్లు మీద కుమారుడికి కూడా చట్టబద్దంగా హక్కు ఉండదు అంటూ షాక్ ఇచ్చింది ఈ కోర్టు. కొడుక్కి వివాహం జ‌రిగినా, జ‌ర‌గ‌క‌పోయినా త‌ల్లిదండ్రుల ద‌యాదాక్షిణ్యాల‌తో మాత్ర‌మే వారు ఆ ఇంట్లో ఉండ‌గ‌ల‌రని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. కుమారుడిని ఇంట్లో ఉండానికి అనుమ‌తించినంత‌ మాత్రాన జీవితాంతం అత‌డిని మోయాల‌ని లేద‌ని పేర్కొంటూ మంగ‌ళ‌వారం తీర్పు చెప్పింది. ఇద్దరు కొడుకులు రెండు అంతస్తుల్లో ఉంటున్నారు అనీ వారిని ఖాళీ చేయించాలి అనీ కోర్టుకు అపీల్ చేసుకున్నారు వృద్ధ జంట. ఇల్లు పూర్తిగా తల్లి తండ్రుల సొంతం అయినా కూడా పెళ్లయినా, కాకపోయినా ఆ ఇంట్లో ఉండే హక్కు పిల్లలకి ఉండదు అని జ‌స్టిస్ ప్ర‌తిభా రాణి ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు. అయితే త‌ల్లిదండ్రుల అనుమతితో మాత్ర‌మే వారికి ఆ ఇంట్లో ఉండే హ‌క్కు ఉంటుంద‌ని పేర్కొన్నారు.