బిగ్ బ్రేకింగ్: అయోధ్య కేసులో సుప్రీం తీర్పు – వివాదాస్పద స్థలం రామ మందిర నిర్మాణానికే!

Saturday, November 9th, 2019, 11:53:15 AM IST

ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన అయోధ్య తీర్పు వచ్చేసింది. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీద్ భూ యాజమాన్య వివాదం పై సుప్రీమ్ కోర్ట్ ఏక గ్రీవ తీర్పు వెలువరించింది. వివాదస్పద కట్టడం వున్నా స్థలం హిందువులదేనని స్పష్టం చేసింది సుప్రీమ్ కోర్ట్. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందనే తేల్చి చెప్పడం జరిగింది. అయితే ఈ స్థలానికి సంబంధించి మూడు నెలల్లో కేంద్రం ట్రస్ట్ ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతే కాకుండా వినువాదాస్పద స్థలాన్ని ట్రస్ట్ ఆదీనం లో ఉంచాలని సూచించింది. మసీద్ నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని సూచించింది. మసీద్ నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల స్థలం కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలని సుప్రీం కోర్ట్ తెలిపింది. రాజకీయాలకు చరిత్రలకు అతీతంగా నిలబడాలని సుప్రీం కోర్ట్ పేర్కొనడం జరిగింది.

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజాన్ గొగోయ్ చదివారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి రెండు మతాలను విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నట్లుగా తెలిపారు. పురావస్తు శాఖ నివేదిక ల ఆధారంగా తీర్పు చెబుతున్నట్లు స్పష్టం చేసారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగా వివాదాస్పద స్థలం ప్రభుత్వానిది అని స్పష్టం చేసారు. ఈ స్థలం పై ఎవరూ యాజమాన్య హక్కు కోరలేదని వివరించారు. వివాదాస్పద స్థలం లో మందిరం ఉన్నట్లు పురావస్తు శాఖా నివేదికలు చెబుతున్నాయని అన్నారు. మసీద్ నిర్మాణానికి ముందే ఆ నిర్మాణం ఉందని చెప్పారు. అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ విభాగం చెబుతోంది అని అన్నారు. హిందువులు రామ జన్మభూమిని రామజన్మ మందిరంగా విశ్వసిస్తారని, అయితే మందిరాన్ని కూలగొట్టి మసీద్ నిర్మించడం ఎక్కడ లేదని పురావస్తు శాఖ తెలిపింది.

వివాదాస్పద స్థలాన్ని హిందువులకు కేటాయిస్తున్నామని సుప్రీం కోర్ట్ తుది తీర్పు వెల్లడించిన అనంతరం, హింసను, విద్వేషాలను ప్రేరేపించే సందేశాలను పంపించే వారిపై కఠిన చర్యలు వుంటాయని కేంద్రం హెచ్చరించింది. తీర్పుని గౌరవించాలని రాజకీయ నాయకులు, మత పెద్దలు ప్రజలకు విజ్ఞప్తి చేసారు.