టీవీ9 ఎక్స్ ర‌విప్ర‌కాష్‌కు సుప్రీమ్ అక్షింత‌లు!

Tuesday, June 4th, 2019, 09:30:57 AM IST

టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాష్ తెలంగాణ పోలీసుల బారి నుంచి త‌ప్పించుకోవ‌డానికి సుప్రీమ్ కోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న పిటీష‌న్‌ను సోమ‌వారం విచార‌ణకు స్వీక‌రించిన సుప్రీమ్ ధ‌ర్మాస‌నం ర‌విప్ర‌కాష్‌కు చుర‌క‌లంటించింది. పోలీసులు కోరిన‌ట్టుగా విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. ఇక ముంద‌స్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులోనే తేల్చు కోవాల‌ని, ఇక్క‌డ అలాంటి ఉత్త‌ర్వులు ఇవ్వ‌లేమ‌ని ర‌విప్ర‌కాష్‌కు సుతిమెత్తంగా చుర‌క‌లంటించింది.

ముంద‌స్తు బెయిల్‌పై మెరిట్ ఆధారంగా విచార‌ణ చేప‌ట్టాల‌ని ఈ సంద‌ర్భంగా తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. జూన్ 10న ముంద‌స్తు బెయిల్‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని, అదే విధంగా ర‌విప్ర‌కాష్ 41ఏ నిబంధ‌న ప్ర‌కారం సైబ‌రాబాద్ పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని, అరెస్ట్ చేయాల‌నుకుంటే 48 గంట‌ల ముందు అత‌నికి నోటీసులు జారీ చేయాల‌ని ధ‌ర్మాస‌రం వెల్ల‌డించింది. అయితే తెలంగాణ ప్ర‌భుత్వం త‌రుపున వాదించిన న్యాయ‌వాది రెండు ద‌ఫాలుగా నోటీసులు పంపించినా ర‌విప్ర‌కాష్ నుంచి ఎలాంటి స‌మాధానం లేద‌ని, విచార‌ణ‌కు అత‌ను స‌హ‌క‌రించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. ర‌విప్ర‌కాష్ త‌రుపున అభిషేక్ సింఘ్వీ వాద‌న‌లు వినిపించారు.