“సైరా” భీకర యుద్ధానికి రంగం సిద్ధం చేస్తున్న సురేందర్ రెడ్డి..!

Monday, September 17th, 2018, 03:02:57 PM IST

“బాస్ ఈస్ బ్యాక్” అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ హీరోగా థియేటర్ల మీద తన ప్రభంజనాన్ని చూపిన విషయం తెలిసినదే.. అయితే ఖైదీ నెంబర్ 150 తర్వాత ఒక అద్భుత చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి కూడా తెలిసినదే. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వీయ నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం “సైరా నరసింహా రెడ్డి”.బ్రిటీషువారి మీద మొదటి సారిగా తిరుబాటుని చూపి ప్రాణాలు కోల్పోయిన మొట్టమొదటి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుని యొక్క జీవిత చరిత్ర.

ఈ చిత్రం విషయంలో అటు నిర్మాత రామ్ చరణ్ ఇటు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఎక్కడా తగ్గట్లేదు అని తెలుస్తుంది. ఐతే ఈ చిత్రానికి సంబంధించి ఈ రోజు సురేందర్ రెడ్డి తన ట్విట్టర్ ద్వారా ఒక వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోని గమనించినట్టు ఐతే షూటింగ్ నిమిత్తం జార్జియాలో ఉన్నట్టు తెలుస్తుంది, ఆ ప్రాంతంలో ఎదో ఒక భీకర సన్నివేశానికి అక్కడ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది.ఆ ట్వీట్ లో కూడా సురేందర్ రెడ్డి “యుద్ధానికి అంతా సిద్ధం” అన్నట్టుగా తెలుపుతున్నారు. ఈ చిత్రం దాదాపు 180 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు అనే వార్త చక్కర్లు కొడుతుంది.